‘ఆధార్‌’ కోసం పడిగాపులు

ABN , First Publish Date - 2021-08-21T05:41:53+05:30 IST

రేషన్‌కార్డుల్లో ఐదేళ్లు దాటిన చిన్నారులంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని... లేకుంటే సరుకులు అందించబోమని అధికారులు చెప్పడంతో ఆధార్‌ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి.

‘ఆధార్‌’ కోసం పడిగాపులు

బొబ్బిలిరూరల్‌  ఆగస్టు 20 : రేషన్‌కార్డుల్లో ఐదేళ్లు దాటిన చిన్నారులంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని... లేకుంటే సరుకులు అందించబోమని అధికారులు చెప్పడంతో ఆధార్‌ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. పాచిపెంట, మక్కువ, సాలూరు గిరిజన ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో గిరిజనులు ఆధార్‌ నమోదు కోసం శుక్రవారం బొబ్బిలి పట్టణానికి ఆటోలు, జీపుల్లో తమ పిల్లలను తీసుకొచ్చారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలోని ఆధార్‌ సెంటర్‌లో సర్వర్‌ పని చేయకపోవడంతో వారంతా పడిగాపులు కాశారు.  


ఫోటోః 20బిబిఎల్‌పి 3: పడిగాపులు కాస్తున్న చిన్నారులు 


Updated Date - 2021-08-21T05:41:53+05:30 IST