జాబ్‌మేళాకు విశేష స్పందన
ABN , First Publish Date - 2021-08-26T05:22:29+05:30 IST
నగరంలోని టీటీడీసీ మహిళా ప్రాంగణంలో సీడాప్-వైఎస్‌ఆర్ క్రాంతిపథం, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది.

విజయనగరం (ఆంధ్రజ్యోతి) ఆగస్టు 25 : నగరంలోని టీటీడీసీ మహిళా ప్రాంగణంలో సీడాప్-వైఎస్‌ఆర్ క్రాంతిపథం, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం గ్రామంలోని ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేసేందుకు గాను నిర్వహించిన ఇంటర్వ్యూలకు 101 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సైనాఫిటిక్స్ కంపెనికి 27మంది, ఇన్నోవేరా ల్యాబ్‌కు 17 మంది మొత్తంగా 44 మంది ఎంపికయ్యారు. వారికి కంపెనీ ప్రతినిధులు నియామక పత్రాలు అందజేశారు. డీఆర్‌డీఏ పీడీ డాక్టర్ ఎం.అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగం రాలేదని యువత దిగులు చెందడం సరికాదన్నారు. ఖాళీగా ఉన్న సమాయాన్ని వృథా చేయకుండా అవకాశం వచ్చినప్పడు జీతం గురించి ఆలోచించకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని సూచించారు.