జీసీసీ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్‌లు
ABN , First Publish Date - 2021-07-25T05:12:51+05:30 IST
గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడుతున్నట్టు జీసీసీ మేనేజర్ కృష్ణ తెలిపారు.

గుమ్మలక్ష్మీపురం : గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపడుతున్నట్టు జీసీసీ మేనేజర్ కృష్ణ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ తమ కార్యాలయం ఆవరణలో ఇప్పటికే ఆరు షాపులు నిర్మించా మన్నారు. మరో రూ.8 లక్షలతో ఐదు షాపులు నిర్మించి అద్దెకు ఇస్తామన్నారు. షాపుల అద్దెల ద్వారా ఆదాయం పెరుగుతుందని చెప్పారు. జీసీసీ ద్వారా నిర్వ హిస్తున్న వంట గ్యాస్ సిలిండర్ల అమ్మకాలు, పెట్రోల్ బంకు, సూపర్ బజార్ నిర్వహణ ఆశాజనకంగా ఉందని తెలిపారు. డీఆర్ డిపోల ద్వారా నిత్యావసరాల అమ్మకాలు పెంచుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.