తెలంగాణ ఎంసెట్‌లో మెరిశారు..
ABN , First Publish Date - 2021-08-26T05:23:26+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 7, 9 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని కామాక్షినగర్‌కు చెందిన ప్రణయ్ ఏడో ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి చదువులో అద్వితీయంగా రాణిస్తున్న ప్రణయ్ జేఈఈ మెయిన్స్‌లోనూ మంచి ర్యాంకు కైవసం చేసుకున్నాడు.

జిల్లా విద్యార్థులకు 7, 9 ర్యాంకులు
విజయనగరం దాసన్నపేట, ఆగస్టు 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎంసెట్ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 7, 9 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని కామాక్షినగర్‌కు చెందిన ప్రణయ్ ఏడో ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి చదువులో అద్వితీయంగా రాణిస్తున్న ప్రణయ్ జేఈఈ మెయిన్స్‌లోనూ మంచి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఎన్‌టీఎస్‌ఈ ఉపకార వేతనానికి ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి ఫిజిక్స్ ఒలంపియాడ్‌లోనూ పాల్గొన్నాడు. ఈయన తల్లిదండ్రులు రామారావు, జ్యోతిలు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరికి ఇద్దరు సంతానం కాగా కుమార్తె హైదరాబాదులో డిగ్రీ చదువుతుండగా, కుమారుడు ప్రణయ్ ఎంసెట్ ఫలితాల్లో ఏడో ర్యాంకు సాధించాడు.
దివాకర్‌సాయికి తొమ్మిదో ర్యాంకు
విజయనగరంలో కలెక్టరేట్‌కు సమీపంలో గంట్యాడ రోడ్డులో నివాసం ఉంటున్న ఎస్.దివాకర్‌సాయి తెలంగాణ ఎంసెట్‌లో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. ఇదివరకు ఈయన పలు మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందుకున్నాడు. తండ్రి ఎస్.శ్రీనివాసరావు పోలీసు శిక్షణ కళాశాలలో హెచ్‌సీగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మల్లేశ్వరి గృహిణిగా ఉన్నారు. కుమార్తె ఎంబీబీఎస్ పూర్తిచేసి పీజీ విద్యకు సిద్ధమౌతుండగా కుమారుడు దివాకర్‌సాయి తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో తొమ్మిదో ర్యాంకు సాధించి సత్తా చాటాడు.