సేవలే అరబిందో ఫార్మా లక్ష్యం

ABN , First Publish Date - 2021-05-19T04:51:17+05:30 IST

విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణంలో ప్రజా జీవన ప్రమాణాలు మెరుగే లక్ష్యంగా అరబిందో ఫార్మా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుందని సీనియర్‌ జనరల్‌ మేనేజరు ఎన్‌ఆర్‌ రాజారెడ్డి అన్నారు.

సేవలే అరబిందో ఫార్మా లక్ష్యం
అంబులెన్స్‌లను ప్రారంభిస్తున్న జీఎం రాజారెడ్డి

విజయనగరం దాసన్నపేట : విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణంలో ప్రజా జీవన ప్రమాణాలు మెరుగే లక్ష్యంగా అరబిందో ఫార్మా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుందని సీనియర్‌ జనరల్‌ మేనేజరు ఎన్‌ఆర్‌ రాజారెడ్డి అన్నారు. కరోనా సెకెండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉండడంతో ఉత్తరాంధ్ర ప్రజల అత్యవసర సేవల కోసం సిద్ధం చేసిన అంబులెన్స్‌లను మంగళవారం ఆయన ప్రారంభించారు. అరబిందో ఫౌండేషన్‌ తరుపున ఈ అంబులెన్స్‌లను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. Updated Date - 2021-05-19T04:51:17+05:30 IST