రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2021-11-21T05:47:34+05:30 IST
మండల పరిధి ఆరికతోట - బూసయ్యవలస గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

రామభద్రపురం: మండల పరిధి ఆరికతోట - బూసయ్యవలస గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బాడంగి మండలం ముగడ గ్రామానికి చెందిన బోని నాని ద్విచక్రవాహనంపై రామభద్రపురం వైపు వెళ్తుండగా, విజయనగరం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నాని కుడికాలు విరిగిపోవడంతోపాటు తీవ్రంగా గాయప డగా, చికిత్స నిమిత్తం 108 వాహనంలో బాడంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.