నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్‌: ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-31T04:02:26+05:30 IST

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్‌ చేయాలని ఎస్పీ రాజకుమారి పోలీసు అధికారులను ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్‌: ఎస్పీ
రాజీవ్‌ క్రీడా ప్రాంగణ రహదారిని పరిశీలిస్తున్న ఎస్పీ

 విజయనగరం క్రైం, మే 30:  కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్‌ చేయాలని ఎస్పీ రాజకుమారి పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం నగరంలోని రాజీవ్‌క్రీడా ప్రాంగణం, కూరగాయల మార్కెట్‌, కోట జంక్షన్‌, రింగురోడ్డు, గంటస్తంభం ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..   ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రజలకు కరోనా నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. అయితే  కొంత మంది వ్యక్తులు మాస్క్‌లు లేకుండా రోడ్లపైకి వస్తూ  యథేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  కర్ఫ్యూ సడలింపు సమయంలో కొన్ని దుకాణాల ముందు భౌతిక దూరం కనిపించడం లేదని, ప్రజలు గుంపుగా దర్శనమిస్తున్నారని తెలిపారు. ఇకపై ఇలా కనిపిస్తే ఊరుకునేది లేదని తెలిపారు.  కరోనా నిబంధనలను ప్రతిఒక్కరూ పక్కాగా పాటించాలని సూచించారు.  సీఐలు మురళీ, సీహెచ్‌ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు హరిబాబు నాయుడు, భాస్కరరావు తదితరులు ఉన్నారు. 


  

Updated Date - 2021-05-31T04:02:26+05:30 IST