రెండు గంటల్లో చోరీ సొత్తు స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-31T05:39:24+05:30 IST

చోరీ జరిగిన రెండు గంటల వ్యవధిలోనే దొంగను పట్టుబడ్డా రు.

రెండు గంటల్లో చోరీ సొత్తు స్వాధీనం

చీపురుపల్లి: చోరీ జరిగిన రెండు గంటల వ్యవధిలోనే దొంగను పట్టుబడ్డా రు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. గురువారం వేకువజా మున జరిగిన ఘటనకు సంబంధించి ఎస్‌ఐ సన్యాసినాయుడు శనివారం అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలికి చెందిన పెద్దిన శిరీష ఈనెల 27న చీపురుపల్లిలో ఓ వివాహానికి హాజరయ్యారు. పెళ్లి హడావుడిలో ఉండగా రాత్రి 12 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు మెడలో బంగారు ఆభరణాలు తెంచుకుపోయారు. అదే రోజు అర్ధరాత్రి 2 గంటలకు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సన్యాసి నాయుడు సిబ్బందితో రంగంలోకి దిగారు. చోరీకి పాల్పడిన ఈశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 

 

Updated Date - 2021-10-31T05:39:24+05:30 IST