సారా రవాణాపై దాడి
ABN , First Publish Date - 2021-05-21T05:29:16+05:30 IST
సినీ పక్కిలో ఆటో, కారులో రవాణా చేస్తున్న సారాను ఎక్సైజ్ స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో అధి కారులు, సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు.

ఆటో, కారును స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌అధికారులు
పార్వతీపురంటౌన్, మే 20: సినీ పక్కిలో ఆటో, కారులో రవాణా చేస్తున్న సారాను ఎక్సైజ్ స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో అధి కారులు, సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్ ఈబీ సీఐ కలీమ్ తెలిపిన వివరాల ప్రకారం గురు వారం ఉదయం ఒడిశా నుంచి డోకిశిల, గోచెక్క మహిళా సంఘాల సమాచారం మేరకు ఎక్సైజ్ ఏఈఎస్ శ్రీనాథుడు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు నాగేశ్వరరావు, పద్మావతి, సిబ్బంది గోచెక్క గ్రామ సరిహద్దుల్లో ఇండిగో కారుల్లో 460 లీటర్ల సారాను రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. అలాగే డోకిశీలగ్రామ సరిహద్దుల్లో ఆటోలో రవాణా చేస్తున్న 460 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారమన్నారు. సారా రవాణా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సారా తయారీ, రవాణాదారులకు మరోసారి హెచ్చ రిస్తామన్నారు. సారాను పట్టుకోవడంలో సహకరించిన మహిళా సంఘాల సభ్యులకు అభినందనలు తెలిపారు.