సామాన్యునిపై బండ

ABN , First Publish Date - 2021-02-05T05:34:25+05:30 IST

పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఆందోళన చెందుతున్న సామాన్యుల నెత్తిన మరో భారం పడింది. వాటి కోవలో గ్యాస్‌ చేరింది. రాయితీ సిలెండర్‌పై రూ.25, రాయితీయేతర సిలెండర్‌పై రూ.184 చొప్పున ధరలను పెంచుతూ గురువారం కేంద్రం ప్రకటించింది.

సామాన్యునిపై బండ

రాయితీ సిలెండర్‌పై రూ.25 పెంచిన కేంద్రం

రాయితీయేతర సిలెండర్లపై రూ.184 పెంపు 

విజయనగరం(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 4:

పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఆందోళన చెందుతున్న సామాన్యుల నెత్తిన మరో భారం పడింది. వాటి కోవలో గ్యాస్‌ చేరింది. రాయితీ సిలెండర్‌పై రూ.25, రాయితీయేతర సిలెండర్‌పై రూ.184 చొప్పున ధరలను పెంచుతూ గురువారం కేంద్రం ప్రకటించింది. ఈ పరిణామంపై గ్యాస్‌ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నిత్యం పెంచుకుంటూ పోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో సుమారు 31కి పైగా గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 6,81,700  కనెక్షన్లు ఉన్నాయి. నెలకు జిల్లా వినియోగదారులు దాదాపు 2,50,000 సిలిండర్లు వాడుతున్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. నాన్‌ సబ్సిడీ సిలిండర్లను దాదాపు 5200 వినియోగిస్తున్నారు. వీరంతా పెరిగిన ధరపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతి వినియోగదారుని నుంచి డోర్‌ డెలివరీ పేరిట అదనపు వసూళ్లు ఉంటున్నాయి. సాధారణంగా ఐదు కిలోమీటర్ల లోపు వరకూ గ్యాస్‌ను ఉచితంగా అందివ్వాలి. 5 నుంచి 15 కిలోమీటర్ల లోపు వరకూ రూ.10.. 15 కిలోమీటర్లు దాటితే రూ.15 చొప్పున డెలివరీ చార్జీలు తీసుకోవాలని నిబంధన. అన్నిచోట్లా అంతకంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు. సగటున రూ.30 నుంచి రూ.50 వరకూ గ్యాస్‌ డెలివరీ సిబ్బంది బలవంతంగా వసూలు చేస్తుండడం గమనార్హం. దీనిపై సంబంధిత ఏజెన్సీలకు ఫిర్యాదులు అందుతున్నా..ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.


Updated Date - 2021-02-05T05:34:25+05:30 IST