రోడ్డెక్కిన రైతులు

ABN , First Publish Date - 2021-12-29T05:10:08+05:30 IST

ధాన్యం కొనుగోలును తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కాశాపేట రైతులు ఆందోళన చేశారు. మంగళవారం గ్రామం వద్ద 36వ రాష్ర్టీయ రహదారిపై ధాన్యానికి నిప్పు పెట్టి రాస్తారోకో చేశారు. దుక్కి దున్ని విత్తనం చల్లింది మొదలు పంట చేతికొచ్చే వరకు ఈ ఏడాది కురిసిన వర్షాల వల్ల అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డెక్కిన రైతులు
నిరసన తెలియజేస్తున్న రైతులు

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌

 సీతానగరం, డిసెంబరు 28: ధాన్యం కొనుగోలును తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కాశాపేట రైతులు ఆందోళన చేశారు. మంగళవారం గ్రామం వద్ద 36వ రాష్ర్టీయ రహదారిపై ధాన్యానికి నిప్పు పెట్టి రాస్తారోకో   చేశారు. దుక్కి దున్ని విత్తనం చల్లింది మొదలు పంట చేతికొచ్చే వరకు ఈ ఏడాది కురిసిన వర్షాల వల్ల అష్టకష్టాలు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమే తప్ప మండలంలోని ఆర్‌బీకేల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తేలు తిరుపతి, బి.శ్రీనివాసరావు, గోపాల్‌, రాములు తీవ్ర నిరాశ వ్యక్తంచేశారు.  విషయం తెలిసి బొబ్బిలి ఏడీ మాలకొండయ్య, ఏవో అవినాష్‌లు రైతుల వద్దకు చేరుకుని సివిల్‌ సప్లయిస్‌ అధికారులతో చర్చించారు. గోనె సంచులు మిల్లర్ల ద్వారా సరఫరా చేస్తామని, ధాన్యం కొనుగోలు చేస్తామని తెలపడంతో వెనుదిరిగారు. Updated Date - 2021-12-29T05:10:08+05:30 IST