‘రెస్కో విలీనం నిర్ణయం సరికాదు’

ABN , First Publish Date - 2021-05-31T04:03:13+05:30 IST

చీపురుపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘాన్ని ఈపీడీసీఎల్‌లో విలీనం చేయాలన్న నిర్ణయం సరైంది కాదని టీడీపీ విజయనగరం పార్ల మెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలి పారు.

‘రెస్కో విలీనం నిర్ణయం సరికాదు’

చీపురుపల్లి, మే 30: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘాన్ని ఈపీడీసీఎల్‌లో విలీనం చేయాలన్న నిర్ణయం సరైంది కాదని  టీడీపీ విజయనగరం పార్ల మెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలి పారు.  ఆదివారం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ..  సుమారు నాలుగు దశాబ్దాలుగా ఈ సంస్థ చీపురుపల్లి ప్రాంతంలో రైతులకు సేవలందిస్తోందన్నారు. ఈ సంస్థ పరిధిలో ఉన్న  విద్యుత్‌ కనెక్షన్లు జిల్లాలో మరెక్కడా లేవ న్నారు. వినియోగదారులు భాగస్వామ్యంతో ఎంతో సమర్థంగా సంస్థ పని చేస్తోందని తెలిపారు.  చీపురుపల్లికి ఒక బ్రాండ్‌గా మారిన రెస్కో ఏడాదికి ఆరు కోట్ల రూపా యల లాభాన్ని ఆర్జిస్తోందని చెప్పారు. ఎన్నో సేవలంది స్తున్న ఆర్‌ఈసీఎస్‌ను డిస్కంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో వినియోగదారులతో కలిసి పోరాటం చేస్తామని నాగార్జున స్పష్టం చేశారు. 

 

Updated Date - 2021-05-31T04:03:13+05:30 IST