చిన్నారికి ఆర్థిక సాయం అందజేత

ABN , First Publish Date - 2021-01-13T05:30:00+05:30 IST

ఎల్విన్‌పేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న టీవీ తిరుపతిరావు క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి బుధవారం ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.

చిన్నారికి ఆర్థిక సాయం అందజేత

గుమ్మలక్ష్మీపురం: ఎల్విన్‌పేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న టీవీ తిరుపతిరావు క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి బుధవారం ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన తన్మయి(10) క్యాన్సర్‌తో గత కొద్ది కాలం నుంచి బాధపడుతోంది. ఈమె నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి. తండ్రి లేకపోవడంతో తాతయ్య అనంతరావు, అమ్మమ్మ పార్వతి వద్ద ఉంటుంది. ఈమె జీవన స్థితిగతులను తెలుసుకున్న ఎల్విన్‌పేట సీఐ తిరుపతిరావు వైద్యం కోసం రూ.పదివేల ఆర్థిక సహాయం చేశారు. వైద్యానికి ఎంత ఖర్చయినా అండగా ఉంటానని తన్మయి కుటుంబానికి భరోసా ఇచ్చారు.

Updated Date - 2021-01-13T05:30:00+05:30 IST