లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించండి : జేసీ
ABN , First Publish Date - 2021-05-09T05:12:46+05:30 IST
జిల్లాలో పేదల ఇళ్ల కోసం రూపొందించిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జేసీ వెంకటరావు ఆదేశించారు. శనివారం సంబంధించిన శాఖాధికారులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు.

కలెక్టరేట్, మే 8: జిల్లాలో పేదల ఇళ్ల కోసం రూపొందించిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని జేసీ వెంకటరావు ఆదేశించారు. శనివారం సంబంధించిన శాఖాధికారులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దీనిలో భాగంగా జూన్ నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారం భించాల్సి ఉందని వెల్లడించారు. వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 846 లేఅవుట్లు రూపొందిం చామన్నారు. 294 లేఅవుట్లలో ఇప్పటికే బోర్లు తవ్వకం పూర్తయిందని చెప్పారు. మిగిలిన వాటిల్లో ఈనెల 25కి పూర్తి చేసి, విద్యుత్ సదుపాయం కల్పించాలని సూచించారు.