ఇళ్ల పట్టాలు అందజేయండి

ABN , First Publish Date - 2021-03-23T05:27:46+05:30 IST

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను ఆర్థిక ఇబ్బందులు కారణంగా నిర్మించలేక పోయామని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా తమ స్థలాల ను స్వాధీనం చేసుకున్నారని, తమకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కొయ్యానపేట గ్రామ స్థులు కోరారు.

ఇళ్ల పట్టాలు అందజేయండి

మక్కువ, మార్చి 22: గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను ఆర్థిక ఇబ్బందులు కారణంగా నిర్మించలేక పోయామని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా తమ స్థలాల ను స్వాధీనం చేసుకున్నారని, తమకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కొయ్యానపేట గ్రామ స్థులు కోరారు. ఈమేరకు తహసీల్దార్‌ డి.వీరభద్రరావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. సర్వే నెంబ రు 650/97, 690/97 వరకు ఉన్న ఖాళీ స్థలంలో మంజూరైన ఇళ్లు నిర్మించ లేకపోయామని, ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇళ్ల నిర్మాణం కోసం 40 మంది లబ్ధిదారుల భూములను స్వాధీనం చేసుకున్నారన్నారు. రెవెన్యూ అధికా రులు స్పందించి తమ పాత స్థలాలను ఇప్పించాలని కోరారు.

 

Updated Date - 2021-03-23T05:27:46+05:30 IST