అస్పష్ట విధానాలతో ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-09-04T04:28:28+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అస్పష్ట విధానాలతో సామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి విమర్శించారు. పింఛన్ల తొలగింపునకు నిరసనగా శుక్రవారం నెల్లిమర్లలో నిరసన ర్యాలీ చేపట్టారు. టీడీపీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో, నగర పంచాయతీ కార్యాలయాల వద్ద అధికారులకు వినతిపత్రాలు అందించారు

అస్పష్ట విధానాలతో ఇబ్బందులు



పార్లమెంటరీ తెలుగు మహి ళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి

 నెల్లిమర్ల, సెప్టెంబరు 3: వైసీపీ ప్రభుత్వ అస్పష్ట విధానాలతో సామాన్య, పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి విమర్శించారు. పింఛన్ల తొలగింపునకు నిరసనగా శుక్రవారం నెల్లిమర్లలో నిరసన ర్యాలీ చేపట్టారు. టీడీపీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి ఎంపీడీవో, నగర పంచాయతీ కార్యాలయాల వద్ద అధికారులకు వినతిపత్రాలు అందించారు. వనజాక్షి మాట్లాడుతూ సామాజిక పింఛన్ల తొలగింపు దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు, హిజ్రాలకు సైతం పింఛన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సామాజిక భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. పింఛన్ల నిలిపివేతతో వృద్ధులు, దివ్యాంగుల బతుకుల్లో చీకట్టు అలముకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొలగించిన పింఛన్లను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పింఛన్‌ను ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటును కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పతివాడ తమ్మినాయుడు, గేదెల రాజారావు, పతివాడ తారకరామానాయుడు, బైరెడ్డి లీలావతి, కింతాడ కళావతి, బైరెడ్డి నాగేశ్వరరావు, బొంతు వెంకటరమణ, కౌన్సిలర్లు కె.సత్యనారాయణ, రామలక్ష్మి, లక్ష్మి, రాజప్పన్న తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-04T04:28:28+05:30 IST