లేఅవుట్‌ సిద్ధం చేయండి

ABN , First Publish Date - 2021-08-28T04:42:17+05:30 IST

ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు సంబంధించి పునరావాస స్థలాలను వచ్చే నెల 21లోగా సిద్ధం చేయాలని విజయనగరం ఆర్డీవో భవానీశంకర్‌ ఆదేశించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం పోలిపల్లి నిర్వాసితుల లేఅవుట్‌ అభివృద్ధిపై అన్నిశాఖల అధికారులతో సమీక్షించారు.

లేఅవుట్‌ సిద్ధం చేయండి
లేఅవుట్‌లో పనులను పరిశీలిస్తున్న ఆర్డీవో భవానీశంకర్‌
ఆర్డీవో భవానీశంకర్‌ ఆదేశం

భోగాపురం, ఆగస్టు 27: ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు సంబంధించి పునరావాస స్థలాలను వచ్చే నెల 21లోగా సిద్ధం చేయాలని విజయనగరం ఆర్డీవో భవానీశంకర్‌ ఆదేశించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో శుక్రవారం పోలిపల్లి నిర్వాసితుల లేఅవుట్‌ అభివృద్ధిపై అన్నిశాఖల అధికారులతో సమీక్షించారు. ముడసర్లపేట, మరాడపాలెంకు చెందిన 256 నిర్వాసిత కుటుంబాలకు పోలిపల్లి రెవెన్యూ పరిధిలో చెరకుపల్లి సమీపంలో లేఅవుట్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. విద్యుత్‌, తాగునీరు, రహదారుల వంటి అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. యంత్రాలు, కూలీల సంఖ్యను పెంచి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు.  లేఅవుట్‌ స్థితిగతులను అధికారులు ఆర్డీవోకు వివరించారు. అనంతరం లేఅవుట్‌ పనులను ఆయన పరిశీలించారు. సమీక్షకు వచ్చిన సిబ్బంది డ్రెస్‌కోడ్‌పై ఆర్డీవో అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన ఉద్యోగులు అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. మరోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీటీ డీ.గాంధీ, మండల ఇంజినీరింగ్‌ అధికారి చందునాయుడు,  విద్యుత్‌ శాఖ ఏఈ జ్యోతీశ్వరరావు, ఆర్‌ఐ జోగినాయుడు, ఈవోపిఆర్‌డీవో రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T04:42:17+05:30 IST