మళ్లీ సాదాబైనామాలు

ABN , First Publish Date - 2021-12-31T04:24:22+05:30 IST

సాదాబైనామాలు (గ్రామ పురోణిలు) మళ్లీ తెరపైకి వస్తున్నాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి మండలాల వారీగా వివరాలు సేకరిస్తోంది. ఈమేరకు కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌లకు సమాచారం వచ్చింది. గ్రామాల్లో రిజిస్ర్టేషన్లు లేకుండా భూములు, ఇళ్లు లక్షల్లో ఉన్నాయి.

మళ్లీ సాదాబైనామాలు
సాదాబైనామా(గ్రామ పురోణీల) డాక్యుమెంట్‌

క్రమబద్ధీకరణ దిశగా అడుగులు

 వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం

శృంగవరపుకోట, డిసెంబరు 30:

 సాదాబైనామాలు (గ్రామ పురోణిలు) మళ్లీ తెరపైకి వస్తున్నాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి మండలాల వారీగా వివరాలు సేకరిస్తోంది. ఈమేరకు  కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌లకు సమాచారం వచ్చింది. గ్రామాల్లో రిజిస్ర్టేషన్లు లేకుండా భూములు, ఇళ్లు లక్షల్లో ఉన్నాయి. అప్పట్లో స్థిరాస్తుల కొనుగోలు సమయంలో గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో కాగితాలు (డాక్యుమెంట్‌లు) రాసుకునేవారు. దీంతో రికార్డుల్లో భూబదలాయింపులు జరగలేదు. ఇలా కొనుగోలు చేసిన వారు భూముల్లో సాగు చేసుకుంటున్నప్పటికీ హక్కుదారులు కాలేదు. రికార్డుల్లో ఇప్పటికీ అమ్మకందారుల పేర్లు కొనసాగుతున్నాయి. ఇలాంటి ఆస్తులను క్రమబద్ధీకరించేందుకు గత ప్రభుత్వం  అవకాశం ఇచ్చింది. ప్రతి గ్రామం నుంచి కనిష్టంగా 10 దరఖాస్తులు, గరిష్టంగా 100 దరఖాస్తులు పైబడి రెవెన్యూ అధికారులకు వెళ్లాయి. డాక్యుమెంట్లలో వేర్వేరు సర్వే నంబర్లు ఉండడం, పేర్లు తప్పుగా రాయడం, సర్వే నెంబర్లు లేకుండా తయారుచేయడం వంటి అనేక లోపాలతో జరిగిన గ్రామ రిజిసే్ట్రషన్ల డాక్యుమెంట్‌లను అప్పట్లో రెవెన్యూ అధికారులు పరిశీలించారు. గ్రామాల్లో సభలు పెట్టి విచారించారు. కోనుగోలుదారుల నుంచి నిరభ్యంతర స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. భూమి హద్దుల్లో ఉన్న ఇతర రైతుల నుంచి కూడా స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. అయినప్పటికీ న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న అభిప్రాయంతో తహసీల్దార్‌లు క్రమబద్ధీకరించేందుకు వెనకడుగువేశారు. దాదాపు 98 శాతం పరిష్కరించకుండానే వదిలేశారు. మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణకు పూనుకుంటోంది. తహసీల్దార్‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

వివరాలు సేకరిస్తున్నాం

సాదాబైనామా వివరాలు సేకరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా వాటిని సేకరిస్తున్నాం. గ్రామ పురోణీల ద్వారా అమ్మకాలు జరిగిన చోట్ల రికార్డులో ఒకరు, భూమిపై వేరొకరు ఉన్నారు. ఇలాంటి వారి వివరాల నివేదికను ప్రభుత్వానికి అందిస్తాం

                          - డీఎంజీఎన ప్రసాదరావు, తహసీల్దార్‌, శృంగవరపుకోట
Updated Date - 2021-12-31T04:24:22+05:30 IST