ఎన్నాళ్లకెన్నాళ్లకు!

ABN , First Publish Date - 2022-01-01T04:31:57+05:30 IST

నూతనంగా పెంచిన మొత్తంతో కలిపి సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల నుంచి రూ.2,500 పింఛన్‌ అందించనున్నారు. ఇప్పటివరకూ అందిస్తున్న రూ.2,250కు అదనంగా రూ.250 కలిపి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అధికారంలోకి వస్తే పింఛన్‌ మొత్తాన్ని రూ.3,000కు పెంచుతానని ఎన్నికల్లో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మడత పేచీ పెట్టారు. ఏడాదికి రూ.250 వంతున పెంచుతానని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రూ.250 పెంచారు. తరువాత కరోనాను సాకుగా చూపి పెంచలేదు

ఎన్నాళ్లకెన్నాళ్లకు!
పింఛన్లు పంపిణీ చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

రూ.2,500కు పెరిగిన పింఛన్‌

నేటి నుంచి పంపిణీ

ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/కొమరాడ, డిసెంబరు 31: నూతనంగా పెంచిన మొత్తంతో కలిపి సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల నుంచి రూ.2,500 పింఛన్‌ అందించనున్నారు. ఇప్పటివరకూ అందిస్తున్న రూ.2,250కు అదనంగా రూ.250 కలిపి లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అధికారంలోకి వస్తే పింఛన్‌ మొత్తాన్ని రూ.3,000కు పెంచుతానని ఎన్నికల్లో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మడత పేచీ పెట్టారు. ఏడాదికి రూ.250 వంతున పెంచుతానని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రూ.250 పెంచారు. తరువాత కరోనాను సాకుగా చూపి పెంచలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ నెల నుంచి రూ.250 పెంచుతున్నట్టు ప్రకటించారు. పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టాలని నిర్ణయించింది. సీఎం జగన్‌ సందేశాన్ని లబ్ధిదారులకు చేరేలా రైతుభరోసా కేంద్రాల వద్ద ఎల్‌సీడీ స్ర్కీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. చీపురుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పింఛన్ల పంపిణీని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,36,238 పింఛన్లు అందించనున్నట్టు డీఆర్‌డీఏ పీడీ అశోక్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల కొత్తగా 7,093 పింఛన్లు మంజూరైనట్టు చెప్పారు. శుక్రవారం రాత్రి వరకూ డీఆర్‌డీఏ ఖాతాల్లో నగదు జమ కాలేదు. శనివారం సీఎం జగన్‌ ప్రసంగం తరువాతే జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. 
Updated Date - 2022-01-01T04:31:57+05:30 IST