పీడీఎస్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-11-23T05:50:15+05:30 IST

మండలంలోని తామరఖండి లక్ష్మీగణేష్‌ రైస్‌మిల్లు వద్ద 200 బస్తాలతో 100 క్వింటాళ్ల బియ్యాన్ని లోడింగ్‌ చేస్తుండగా ఎస్‌ఐ బి.మురళి సోమవారం పట్టుకుని తహసీల్దార్‌ అప్పలరాజుకు అప్పగించారు.

పీడీఎస్‌ బియ్యం పట్టివేత

 సీతానగరం:  మండలంలోని తామరఖండి లక్ష్మీగణేష్‌ రైస్‌మిల్లు వద్ద 200 బస్తాలతో 100 క్వింటాళ్ల బియ్యాన్ని లోడింగ్‌ చేస్తుండగా ఎస్‌ఐ బి.మురళి సోమవారం పట్టుకుని తహసీల్దార్‌ అప్పలరాజుకు అప్పగించారు. తహసీల్దార్‌ 6ఏ కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు.   

 శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని వెంకటరమణపేట జంక్షన్‌ వద్ద టాటా ఏస్‌ వాహనంలో తరలిస్తున్న 14 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తహసీల్దార్‌ మూర్తి సోమవారం పట్టుకున్నారు. 30 ప్లాస్టిక్‌ సంచుల్లో బియ్యం ఉన్నాయని, తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ గొడౌన్‌కు తరలించామన్నారు. స్థానిక పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

 

Updated Date - 2021-11-23T05:50:15+05:30 IST