చెరకు బకాయిలు చెల్లించండి

ABN , First Publish Date - 2021-11-03T04:26:55+05:30 IST

ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగార రైతుల బకాయిలను రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చెల్లించాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. బకాయిల చెల్లింపులపై తన చాంబరులో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు.

చెరకు బకాయిలు చెల్లించండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టరేట్‌, నవంబరు 2: ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగార రైతుల బకాయిలను రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చెల్లించాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. బకాయిల చెల్లింపులపై తన చాంబరులో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019-20, 2020-21 సీజన్లలో క్రషింగ్‌కు సంబంధించి రూ.16 కోట్ల 33 లక్షలతో పాటు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డ్యూటీ బకాయిలు 87.50 లక్షలు, ఈపీఎఫ్‌ రూ.3 కోట్ల 41 లక్షలు, జీఎస్‌టీ రూ.3.36 కోట్లు కలిపి మొత్తం రూ.23.98 కోట్ల బకాయిలను చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇద్దరు తహసీల్దారులకు ఆదేశాలు జారీ చేశారు. బకాయిలను తీర్చడానికి బొబ్బిలిలో 14.67  ఎకరాలు... సీతానగరంలో 5.23 ఎకరాల చొప్పున భూమిని వేలం వేయాలని సూచించారు. నిబంధనలన్నింటినీ పాటిస్తూ బకాయిల చెల్లింపు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ కిషోర్‌ కుమార్‌, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ భావ్న, సీతానగరం, బొబ్బిలి తహసీల్దారులు అప్పలరాజు, రామస్వామి, బొబ్బిలి చెక్కర కర్మాగారం సహాయ కమిషనర్‌ లోకేశ్వరరావు, కలెక్టరేట్‌ ఏవో శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-11-03T04:26:55+05:30 IST