రేపటి నుంచి ఓటీఎస్‌ చెల్లింపులు

ABN , First Publish Date - 2021-11-10T04:58:28+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు(ఓటీఎస్‌) పథకానికి సంబంధించి ఈ నెల 11 నుంచి నగదు చెల్లింపులు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) మయూర్‌అశోక్‌ ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో జేసీ ఆర్‌.మహేష్‌ కుమార్‌తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు.

రేపటి నుంచి ఓటీఎస్‌ చెల్లింపులు
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న జేసీలు మయూర్‌అశోక్‌, మహేష్‌కుమార్‌

 జేసీల ఆదేశం

కలెక్టరేట్‌, నవంబరు 9: జగనన్న సంపూర్ణ గృహ హక్కు(ఓటీఎస్‌) పథకానికి సంబంధించి ఈ నెల 11 నుంచి నగదు చెల్లింపులు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ (హౌసింగ్‌) మయూర్‌అశోక్‌ ఆదేశించారు. మండల స్థాయి అధికారులతో జేసీ ఆర్‌.మహేష్‌ కుమార్‌తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి నుంచి తొలుత నగదు స్వీకరించాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ముందుగా చేయాల్సిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఓటీఎస్‌పై లబ్ధిదారులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇంకా కొన్ని చోట్ల సర్వే పెండింగ్‌ ఉందని, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జేసీ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ శతశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా చూడాలన్నారు. సచివాలయ భవన నిర్మాణం ఎక్కడైనా స్థల సమస్య కారణంగా ఆగినట్లయితే వెంటనే దానిని పరిష్కరించి పంచాయితీరాజ్‌ ఇంజనీర్లకు అప్పగించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరరావు, డీపీవో సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-10T04:58:28+05:30 IST