ఓటు నమోదుకు అవకాశం

ABN , First Publish Date - 2021-08-11T04:51:54+05:30 IST

ఓటు హక్కు నమోదుకు ఎన్నికల కమిషన్‌ కార్యాచరణ తయారు చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 9 నుంచి అక్టోబరు 31 వరకూ డీఎల్‌వోలు ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు.

ఓటు నమోదుకు అవకాశం


అక్టోబరు 31 వరకూ ఇంటింటి సర్వే 

కలెక్టరేట్‌, ఆగస్టు 10:

ఓటు హక్కు నమోదుకు ఎన్నికల కమిషన్‌ కార్యాచరణ తయారు చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 9 నుంచి అక్టోబరు 31 వరకూ డీఎల్‌వోలు ఇంటింటా సర్వే నిర్వహించనున్నారు. నవంబరు ఒకటిన డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ చేసి అప్పటి నుంచి అదే నెల 30 వరకూ ఓట్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాల పరిశీలన చేపట్టనున్నారు. వాటిని డిసెంబరు 20న క్లియర్‌ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 5న  ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు. ప్రత్యేక ఓటు నమోదు కార్యక్రమంపై ఇప్పటికే ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. బీఎల్‌వోల విధులను వివరించారు. ప్రత్యేక ఓటు నమోదుపై కలెక్టర్‌ సూర్యకుమారి కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 


Updated Date - 2021-08-11T04:51:54+05:30 IST