కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-04-22T05:05:24+05:30 IST

కరోనా మహమ్మారి రెండో దశలో జడలు విప్పుతు న్న నేపథ్యంలో జిల్లాలో పలు పట్టణాల్లో బుధవారం కూడా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించారు.

కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌డౌన్‌
సాలూరులో రెండు గంటల తర్వాత మూసి ఉన్న దుకాణాలు

సాలూరు రూరల్‌ : కరోనా మహమ్మారి రెండో దశలో జడలు విప్పుతు న్న నేపథ్యంలో జిల్లాలో పలు పట్టణాల్లో బుధవారం కూడా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించారు. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం తదితర పట్టణాల్లో తొలుత నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం పూట  వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. సాలూరులో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మెయిన్‌రోడ్డు బోసిబోయింది. మధ్యాహ్నం నుంచి పట్టణవాసులు సైతం బయటకు రావడం లేదు. మరోవైపు పట్టణ ఎస్‌ఐ ఫకృద్దీన్‌ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా పర్యటిస్తూ మాస్క్‌లేని వారిపై చర్యలు తీసుకుంటు న్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్‌ఐ పిలుపునిచ్చారు.

కొత్తవలసలో సాయంత్రం వరకు...

కొత్తవలస : కరోనా ప్రభావం కారణంగా కొత్తవలస లో కిరణాషాపులతోపాటు వర్తక సంఘం పరిధిలోకి వచ్చే మిగిలిన వ్యాపార సంస్థలను  పరిమిత వేళల్లో కొద్దిరోజుల పాటు తెరవా లని కొత్తవలస వర్తక సంఘం నిర్ణయించింది. బుధవారం సాయంత్రం కొత్తవలసలో వర్తక సంఘసమావేశం నిర్వహించారు. కొత్తవలసలో కిరణాషాపులను మిగిలిన వ్యాపార సంస్థలను  ఉదయం 8 గంటలకు తెరచుకుని సాయంత్రం 5 గంటలకు మూసేసే విధంగా తీర్మానం చేశారు. కేవలం కిరణాషాపులనే కాకుండా కొత్తవలస  వర్తకం సంఘం పరిధిలోకి వచ్చే అన్నిషాపులను కూడా మూసేయాలని నిర్ణయించుకున్నారు. షాపులకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్కు పెట్టుకుని వస్తేనే సరుకులు విక్రయించాలని, భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసుకు న్నారు. కార్యక్రమంలో వర్తక సంఘం ప్రతినిధులు ముర్కూరి సన్యాసిరావు(తాత), బెల్లాల కొండ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-22T05:05:24+05:30 IST