లారీ ఢీకొని ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-10-30T05:04:47+05:30 IST

లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన సాలూరు పట్టణంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.

లారీ ఢీకొని ఒకరు మృతి

సాలూరు: లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన సాలూరు పట్టణంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని డబ్బివీధికి చెందిన సంకూర్తి శ్రీనివాసరావు(38) లారీ క్లీనర్‌గా జీవనం గడుపుతున్నారు. ఈయనకు వివాహమై సుమారు 15 సంవత్సరాలు అయ్యింది. తన భార్య చిన్నమ్మలుతో ఈ మధ్య కాలంలో చిన్నపాటి ఘర్షణలు జరుగుతున్నాయి. ఈక్రమంలో అదే వీధిలో తన అత్తవారింట్లో నివాసం ఉన్న భార్య చిన్నమ్మలను పెద్దల వద్దకు పరిష్కారానికి రావాలని కోరారు. ఇంట్లో నుంచి తిరిగి వస్తుండగా మెట్లపై నుంచి జారీ పడ్డారు. ఇంతలో మెయిన్‌రోడ్డు నుంచి మామిడిపల్లి రోడ్డు వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో మృతి చెందారు. మృతుడికి ఇద్దరు కుమారులు మనోజ్‌, ప్రవీణ్‌ ఉన్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.  

 

Updated Date - 2021-10-30T05:04:47+05:30 IST