కారు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-12-29T05:22:29+05:30 IST

కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘట న భోగాపురం మండలం, లింగాలవలస సమీపంలో మంగళవారం చోటుచేసుకుం ది.

కారు ఢీకొని ఒకరి మృతి

 డెంకాడ, డిసెంబరు 28: కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘట న భోగాపురం మండలం, లింగాలవలస సమీపంలో మంగళవారం చోటుచేసుకుం ది.  డెంకాడ ఎస్‌ఐ పద్మావతి అందించిన వివరాల ప్రకారం.. గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన కొలుసు సన్యాసి(65) భోగాపురం మండలం లింగా లవలస సమీపంలో రోడ్డు దాటుతుండగా విశాఖపట్టణం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. లింగా లవలసలో భవానీమాల ధరించిన తన మనువడి ఇరుముడి కార్యక్రమానికి వెళ్లేం దు కు సన్యాసి రోడ్డు దాడుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సన్యాసి కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భోగాపురం సుందరపేట ఆసుపత్రికి తరలించారు. పంచనామా అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తా మ ని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-12-29T05:22:29+05:30 IST