ఏపీ బోర్డుల ఏర్పాటు అడ్డగింత

ABN , First Publish Date - 2021-10-25T06:05:51+05:30 IST

కొఠియా గ్రూప్‌ డొలియాంబ వద్ద ఏపీకి చెందిన సైన్‌బోర్డుల ఏర్పాటును ఆదివారం ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో గిరిజనులు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో మూడు రోజులుగా ఒడిశా బలగాలు పహారా కాస్తూ ఏపీ అధికారులను నిలువరిస్తున్న విషయం విదితమే.

ఏపీ బోర్డుల ఏర్పాటు అడ్డగింత
స్వాధీనం చేసుకున్న ఏపీ సైన బోర్డులతో ఒడిశా పోలీసులు

అభ్యంతరం తెలిపిన ఒడిశా పోలీసులు 

కొఠియా గ్రూప్‌ డొలియాంబ వద్ద గిరిజనులతో వాగ్వాదం

సాలూరు రూరల్‌, అక్టోబరు 24: కొఠియా గ్రూప్‌ డొలియాంబ వద్ద ఏపీకి చెందిన సైన్‌బోర్డుల ఏర్పాటును ఆదివారం ఒడిశా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో గిరిజనులు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగినట్టు తెలిసింది. కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో మూడు రోజులుగా ఒడిశా బలగాలు పహారా కాస్తూ ఏపీ అధికారులను నిలువరిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గిరిజనులు ఏపీకి చెందిన సైన్‌ బోర్డులను తొలుత పగులు చెన్నారులో ఏర్పాటు చేశారు. డొలియాంబ సమీపంలో మరో బోర్డు ఏర్పాటు చేస్తున్న సమయంలో ఒడిశా పోలీసులు అక్కడకు వచ్చి అభ్యంతరం తెలిపారు. ఏపీకి చెందిన కార్యక్రమాలు చేయవద్దనడంతో పగులుచెన్నారుకు చెందిన గిరిజనులు వారితో వాగ్వాదానికి దిగారు. తాము ఏపీలో ఉంటామని, ఇక్కడ ఒడిశా పోలీసులకేమి పనంటూ నిలదీశారు. ఒడిశా పథకాలు తమకు వద్దని గట్టిగా మాట్లాడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చేసుకున్నట్టు తెలిసింది. వాగ్వాదాలు అనంతరం ఒడిశా పోలీసులు వెనుదిరిగినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఒడిశా పోలీసులు బోర్డులు ఏర్పాటుకు ఆటంకపరుస్తున్నా.. ఏపీ నుంచి స్పందన లేదని పగులుచెన్నారు గిరిజన నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. Updated Date - 2021-10-25T06:05:51+05:30 IST