నేతన్న నేస్తం జమ

ABN , First Publish Date - 2021-08-11T04:51:02+05:30 IST

నేతన్న నేస్తం పథకం కింద జిల్లాలో 523 మంది చేనేత కార్మికులకు రూ.1.25 కోట్లు అందించినట్లు కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వర్చువల్‌ విధానంలో మీటనొక్కి ఆర్థిక సాయం జమ చేశారు.

నేతన్న నేస్తం జమ
చేనేత కార్మికులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

కలెక్టరేట్‌, ఆగస్టు 10:  నేతన్న నేస్తం పథకం కింద జిల్లాలో 523 మంది చేనేత కార్మికులకు రూ.1.25 కోట్లు అందించినట్లు కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు.  సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వర్చువల్‌ విధానంలో మీటనొక్కి ఆర్థిక సాయం జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ రెండు దఽపాలుగా నేతన్న నేస్తం కింద ఒక్కొక్కరికీ రూ.24 వేల చొప్పున అందజేశామన్నారు.  అర్హులు ఎవరైనా మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ జిల్లాలోని నేత కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. మగ్గాల మరమ్మతులు, నూలు, ముడి సరుకుల కొనుగోలుకు ప్రభుత్వ సాయం వినియో గించుకోవాలని సూచించారు.  రూ.1.25 కోట్ల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్సీ  సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, జేసీ వెంకటరావు, చేనేత జౌళి శాఖ ఏడీపెద్దిరాజు పాల్గొన్నారు. Updated Date - 2021-08-11T04:51:02+05:30 IST