నాబార్డు వార్షిక ప్రణాళిక రూ.7,113.35 కోట్లు

ABN , First Publish Date - 2021-12-26T05:32:22+05:30 IST

నాబార్డు వార్షిక రుణ సామర్ధ్య ప్రణాళికను విడుదల చేశారు. 2022-23 వ్యవసాయ అనుబంధ రంగాలకుగాను రూ.7113.35 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్టు నాబార్డు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పి.హరీష్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో డీసీసీ సమావేశం నిర్వహించారు. ప్రణాళికను వివరించారు. వ్యవసాయ రంగానికి రూ.4,534 కోట్లు కేటాయించామన్నారు. ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.1,634.59 కోట్లు, చిన్న పరిశ్రమలకు రూ.943.77 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. వ్యవసాయ రంగానికి కేటాయింపు

నాబార్డు వార్షిక ప్రణాళిక రూ.7,113.35 కోట్లు
రుణ ప్రణాళికను విడుదల చేస్తున్న అధికారులు


కలెక్టరేట్‌, డిసెంబరు 25: నాబార్డు వార్షిక రుణ సామర్ధ్య ప్రణాళికను విడుదల చేశారు. 2022-23 వ్యవసాయ అనుబంధ రంగాలకుగాను రూ.7113.35 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్టు నాబార్డు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పి.హరీష్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో డీసీసీ సమావేశం నిర్వహించారు. ప్రణాళికను వివరించారు. వ్యవసాయ రంగానికి  రూ.4,534 కోట్లు కేటాయించామన్నారు. ఇతర ప్రాధాన్య రంగాలకు రూ.1,634.59 కోట్లు, చిన్న పరిశ్రమలకు రూ.943.77 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. వ్యవసాయ రంగానికి కేటాయింపుల్లో భాగంగా రూ.3726.47 కోట్లు పంట రుణాలకు, రూ.137.64 కోట్లు సాగునీటి వనరులు అభివృద్దికి కేటాయించినట్టు వెల్లడించారు. రూ.78.62 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకు, రూ.90.24 కోట్లు తోటల పెంపకానికి, రూ.17.04 కోట్లు అడవులు, బంజర భూముల అభివృద్ధికి కేటాయించినట్టు చెప్పారు. పాడి పరిశ్రమ రంగాలకు రూ.247.05 కోట్లు, పౌలీ్ట్ర పరిశ్రమల అభివృద్ధికి రూ.39.76 కోట్లు, మేకలు, పందులు పెంపకానికి రూ.15.07 కోట్లు, గోదాములు, శీతల గిడ్డంకులకు రూ.95.24 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమలు కోసం రూ.53,07 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. విద్యకు రూ.46.95 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.585.18 కోట్లు, స్వయం శక్తి సంఘాల  రుణాలకు రూ.984.03 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగానికి రూ.5.26 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాలు వృద్ధికి రూ.9.69 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ వెంకటరావు, ఎల్‌డిఎం శ్రీనివాస్‌, రిజర్వ్‌ బ్యాంకు ఎల్‌డివో వైభవ్‌ ,డీఆర్‌డీఏ పీడీ ఆశోక్‌కుమార్‌, ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్‌ రాజా రామ్మోహనరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-26T05:32:22+05:30 IST