‘మంత్రి పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలి’
ABN , First Publish Date - 2021-02-07T05:04:42+05:30 IST
రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయా లని టీడీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు.

చీపురుపల్లి: రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తక్షణమే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయా లని టీడీపీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను బ్లాక్‌మెయిల్ చేసేలా మాట్లాడడం రాజ్యాంగాన్ని ధిక్కరించడమే అని తెలిపారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించడం అంటే ప్రజల ఓటు హక్కును హరించడమేనని తెలిపారు.