కేజీబీవీల్లో పోస్టులకు మెరిట్‌ లిస్టు

ABN , First Publish Date - 2021-12-22T05:07:57+05:30 IST

కేజీబీవీల్లో పోస్టులకు మెరిట్‌ లిస్టు

కేజీబీవీల్లో పోస్టులకు మెరిట్‌ లిస్టు
సమగ్ర శిక్ష కార్యాలయం వద్ద అతికిస్తున్న మెరిట్‌ జాబితా

జాబితాపై మూడు రోజులు అభ్యంతరాల స్వీకరణ 

కలెక్టరేట్‌, డిసెంబరు 21: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి మంగళవారం రాత్రి మెరిట్‌ అభ్యర్థుల లిస్టు విడుదల చేశారు. జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం వద్ద గోడపై అతికించారు. సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టరు వేమలి అప్పలస్వామి నాయుడు సమక్షంలో సిబ్బంది జాబితాను విడుదల చేశారు. జిల్లాలో  132 పోస్టులకు 2390 మంది నుంచి దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. మెరిట్‌ జాబితాపై ఈనెల 22 నుంచి 24 తేదీ వరకూ ఏమైనా అభ్యంతరాలుంటే సమగ్ర శిక్ష కార్యాలయంలో స్వీకరిస్తామని ఏపీసీ చెప్పారు. కార్యాలయంలో పని చేసే వేళల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో సంప్రదించాలన్నారు. ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టును విజయనగరం.ఏపీ.జీవో.ఇన్‌ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-22T05:07:57+05:30 IST