వ్యాధుల నివారణకు చర్యలు
ABN , First Publish Date - 2021-10-22T05:08:44+05:30 IST
జిల్లాలో డెంగ్యూ, మలేరియా నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు.

అధికారుల సమీక్షలో జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను
విజయనగరం (ఆంధ్రజ్యోతి), అక్టోబరు 21: జిల్లాలో డెంగ్యూ, మలేరియా నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం జడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిం చారు. జ్వరాలు అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వ్యాప్తికి కారణమైన దోమ లను అరికట్టాలని, వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ మహేష్‌కుమార్, డీఎంహెచ్‌వో రమణకుమారి, డీసీహెచ్ నాగభూ షణం, కేంద్రాసుపత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు, జిల్లా మలేరియా అధికారి తులసీ, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో సుభాషిణి తది తరులు పాల్గొన్నారు.