వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-28T05:17:11+05:30 IST

పట్టణంలోని రామేశ్వరి కాలనీకి చెందిన వెంపడాపు ఆదిలక్ష్మి (23) అనే వివాహిత శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.

వివాహిత ఆత్మహత్య

గరివిడి: పట్టణంలోని రామేశ్వరి కాలనీకి చెందిన వెంపడాపు ఆదిలక్ష్మి (23) అనే వివాహిత శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రణస్థలం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మికి రెండు నెలల కిందట గరివిడి పట్టణంలోని రామేశ్వరి కాలనీకి చెందిన వెంపడాపు ఆదినారాయణతో వివాహం అయ్యింది. ఆదినారాయణ రోజువారీ కూలి పనులు చేస్తుంటాడు. ఆదిలక్ష్మి అత్త గరివిడిలో ఒక ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఈమె ఉదయం 8 గంటలకు వెళ్లి, తిరిగి సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకుంటుంది. ఆదినారాయణ పరిస్థితి కూడా అంతే. ఆదిలక్ష్మి ఆషాఢమాసానికి తన పుట్టింటికి వెళ్లి వారం రోజుల క్రితమే తిరిగి అత్తవారింటికి వచ్చింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు. ఆదిలక్ష్మి తల్లి చిట్టివలస లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గరివిడి ఎస్‌ఐ లీలావతి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

 

Updated Date - 2021-08-28T05:17:11+05:30 IST