స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాదయాత్ర
ABN , First Publish Date - 2021-10-30T04:59:32+05:30 IST
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్.కోట నియోజకవర్గ జనసేనఆధ్వర్యంలో శుక్రవారం కొత్తవలస నుంచి సింహాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు.
కొత్తవలస: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎస్.కోట నియోజకవర్గ జనసేనఆధ్వర్యంలో శుక్రవారం కొత్తవలస నుంచి సింహాచలం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ నెల 31న విశాఖపట్నంలోని గాజువాకలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని తెలిపారు. నియోజకవర్గ నాయకులుసత్తిబాబు, సన్యాసినాయుడు, రవికుమార్, శ్రీను, శ్రీని వాసరాజు, ఎం.శ్రీను పాల్గొన్నారు. చీపురు పల్లి: విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనను విజయ వంతం చేయాలని ఆ పార్టీ ప్రతినిధి డి.రామచంద్రరాజు చీపురుపల్లిలో కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమంలో లక్ష్మణనాయుడు, రాము నాయుడు, లక్ష్మణరావు, సంతోష్, రామకృష్ణ, రమేష్ పాల్గొన్నారు.