గోస్తనీ నదిలో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-28T05:36:45+05:30 IST

విశాఖ జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం వద్ద గోస్తనీ నది లో పడి విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి మృతిచెందాడు.

గోస్తనీ నదిలో పడి వ్యక్తి మృతి

అనంతగిరి: విశాఖ జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం వద్ద గోస్తనీ నది లో పడి విజయనగరానికి చెందిన ఒక వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ రాము అందిం చిన వివరాల ప్రకారం... విజయనగరం బోయవీధికి చెందిన పొంతపల్లి నాగరాజు (35) మంగళవారం కాశీపట్నం వచ్చాడు. బుధవారం సంతలో పనులు ముగించు కుని సమీపంలో వున్న గోస్తనీ నదిలో స్నానానికి వెళ్లాడు. లోతు ఎక్కువ గా వున్న ప్రదేశంలో దిగడంతో నీటిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని తల్లి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

 

Updated Date - 2021-10-28T05:36:45+05:30 IST