టోర్నమెంట్‌ను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-10-30T04:56:30+05:30 IST

పట్టణంలో నవంబరు1న జరగనున్న సీఎం కప్‌ టోర్న మెంట్‌ను విజయవంతం చేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌.వెంకటే శ్వరరావు కోరారు.

టోర్నమెంట్‌ను విజయవంతం చేయండి

చీపురుపల్లి: పట్టణంలో నవంబరు1న జరగనున్న సీఎం కప్‌ టోర్న మెంట్‌ను విజయవంతం చేయాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌.వెంకటే శ్వరరావు కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి పీడీల సమావేశంలో మాట్లాడారు. 1న నియోజకవర్గ స్థాయిలో  కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, షటిల్‌ క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇక్కడ విజేత లైన వారు 6,7 తేదీల్లో జిల్లాస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. టోర్నమెంట్‌కు హాజరయ్యే  క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పి స్తామని వైసీపీ నేతలు ఇ.అనంతం, వి.శ్రీనివాసనాయుడు తెలిపారు.   గుర్ల:   గుర్ల జడ్పీ హెచ్‌ఎస్‌ క్రీడా మైదానంలో శనివారం సీఎం కప్‌ క్రీడా పోటీలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎంఈవో భానుప్రకాష్‌  తెలిపారు.

 


Updated Date - 2021-10-30T04:56:30+05:30 IST