పురోహిత మిత్ర పథకాలతో బ్రాహ్మణులకు రుణాలు

ABN , First Publish Date - 2021-06-09T06:04:50+05:30 IST

అరుంధతి, పురోహిత మిత్ర పథకాల ద్వారా అర్హత కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు రుణాలు అందచేస్తున్నట్టు బ్రాహ్మణ క్రెడిట్‌ సొసైటీ జిల్లా అధికారి శ్రీవాణి తెలిపారు.

పురోహిత మిత్ర పథకాలతో బ్రాహ్మణులకు రుణాలు
బ్రాహ్మణులతో సమావేశమైన శ్రీవాణి

బ్రాహ్మణ క్రెడిట్‌ సొసైటీ జిల్లా అధికారి శ్రీవాణి

చోడవరం, జూన్‌ 8:
అరుంధతి, పురోహిత మిత్ర పథకాల ద్వారా అర్హత కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు రుణాలు అందచేస్తున్నట్టు బ్రాహ్మణ క్రెడిట్‌ సొసైటీ జిల్లా అధికారి శ్రీవాణి తెలిపారు. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రాహ్మణులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ పథకాల ద్వారా ప్రతీ గ్రూపునకు రూ.1.6 లక్షలు మంజూరు చేస్తామని, వీటిని సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ ఉంటుందని తెలిపారు. మండలంలో రూ.1.6 లక్షల చొప్పున ఐదు గ్రూపులకు రుణం మంజూరైందన్నారు. అర్హత కలిగిన బ్రాహ్మణ కుటుంబీకులు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు వడ్డాది నరసింహమూర్తి పంతులు, మండా ఽశ్రీరామమూర్తి, ఎ.రమేశ్‌, శ్రీరామమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-09T06:04:50+05:30 IST