లారీ ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-08-26T05:15:41+05:30 IST

కొత్తవలస-విజయనగరం రోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ వీరజనార్దన్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలసకు చెందిన బూసాల సూరిబాబు (30) అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా పీఎంఎల్‌ కాంప్లెక్స్‌ సమీ పంలో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సూరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు.

లారీ ఢీకొని యువకుడి మృతి
కొత్తవలస: కొత్తవలస-విజయనగరం రోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ వీరజనార్దన్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలసకు చెందిన బూసాల సూరిబాబు (30) అనే యువకుడు బైక్‌పై వెళ్తుండగా పీఎంఎల్‌ కాంప్లెక్స్‌ సమీ పంలో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సూరిబాబు తీవ్రంగా గాయపడ్డాడు. స్థాని కులు గమనించి 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ సూరిబాబు మృతిచెందాడు. మృతుడికి భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న సూరిబా బు అకాల మరణాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 
Updated Date - 2021-08-26T05:15:41+05:30 IST