లారీ ఢీకొని ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2021-09-03T05:50:30+05:30 IST

పెదమానాపురం బీసీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై గురు వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

లారీ ఢీకొని ఒకరికి గాయాలు

దత్తిరాజేరు: పెదమానాపురం బీసీ కాలనీ వద్ద జాతీయ రహదారిపై గురు వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.  పెదమానా పురం ఎస్‌ఐ బి.భాగ్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాచిపెంట మండలం పంచాది గ్రామానికి చెందిన అలపర్తి గణేష్‌ విజయనగరం నుంచి తన స్వగ్రా మానికి బైకుపై వెళుతుండగా పెదమానాపురం వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గణేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచా రంతో 108 వాహనంలో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ భాగ్యం తెలిపారు.

 

Updated Date - 2021-09-03T05:50:30+05:30 IST