రెండు సచివాలయాల్లో భూముల రిజిసే్ట్రషన

ABN , First Publish Date - 2021-12-10T05:14:07+05:30 IST

జిల్లాలోని రెండు గ్రామ సచివాలయాల్లో తొలి దశలో భూముల రిజిస్ర్టేషనసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం రామభద్రపురం, బొండపల్లి మండలాల రెవెన్యూ, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించారు.

రెండు సచివాలయాల్లో భూముల రిజిసే్ట్రషన
మాట్లాడుతున్న జేసీ కిషోర్‌కుమార్‌

జేసీ కిషోర్‌కుమార్‌ 

కలెక్టరేట్‌, డిసెంబరు 9: జిల్లాలోని రెండు గ్రామ సచివాలయాల్లో తొలి దశలో భూముల రిజిస్ర్టేషనసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జేసీ కిషోర్‌కుమార్‌ ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం రామభద్రపురం, బొండపల్లి మండలాల రెవెన్యూ, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమంలో చేపట్టిన సమగ్ర రీసర్వే తొలివిడతగా రెండు గ్రామాల్లో పూర్తయిందని, దీంతో ఆ రెండు గ్రామాల్లో భూముల రిజిస్ర్టేషన్‌ సేవలు సచివాలయాల ద్వారా చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. అందుకు సన్నద్ధం కావాలని రెవెన్యూ, రిజిస్ర్టేషన్‌ శాఖల అధికారులను ఆదేశించారు. రామభద్రపురం మండలం మర్రివలస గ్రామానికి సంబంధించి సోంపురం సచివాలయంలోనూ, బొండపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి సంబంధించి ముద్దూరు సచివాలయంలోనూ ఈ సేవలు ప్రారంభించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ సహాయకులకు రిజిస్ర్టేషన తంతుపై ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇకపై సర్వే నెంబరు వారీగా కాకుండా సమీకృత భూ సర్వే ప్రకారం ల్యాండ్‌పార్శిల్‌ వారీగా భూముల మార్కెట్‌ ధరలు నిర్ణయించాలని చెప్పారు. సర్వే నంబరు వారీగా  ఉండే భూముల మార్కెట్‌ ధరలను ల్యాండ్‌ పార్శిల్‌ వారీగా మార్పు చేసి రెండింటి మధ్య సామీప్యత తీసుకురావాలని చెప్పారు. పార్శిల్‌ వారీగా ధరలు నిర్ణయించిన తరువాత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో భూముల విలువలను నిర్ధారిస్తూ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 గ్రామ సచివాలయాల ద్వారా తొలివిడతగా భూములు రిజిసే్ట్రషన్‌ సేవలు ప్రారంభిస్తున్నారని, అందులో భాగంగా జిల్లాలో రెండు గ్రామ సచివాలయాలను ఇందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. Updated Date - 2021-12-10T05:14:07+05:30 IST