కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-05-19T04:56:36+05:30 IST

జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో కొవిడ్‌ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. డీఆర్‌డీఏ, ఎల్‌డీఎం, ఇతర అధికారులతో మంగళవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ప్యూ కారణంగా బ్యాంకులు రద్దీగా ఉంటాయని, అందువల్ల తప్పసరిగా కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని సృష్టంచేశారు.

కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

31లోగా వైఎస్‌ఆర్‌ బీమా నమోదు

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, మే 18: జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో కొవిడ్‌ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. డీఆర్‌డీఏ, ఎల్‌డీఎం, ఇతర అధికారులతో మంగళవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ప్యూ కారణంగా బ్యాంకులు రద్దీగా ఉంటాయని, అందువల్ల తప్పసరిగా కొవిడ్‌ నిబంధనలు అమలు చేయాలని సృష్టంచేశారు. వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చూడాలని, ప్రతి బ్యాంకు ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాస్క్‌ ధరించిన వారిని మాత్రమే బ్యాంకుల్లోకి అనుమతించాలన్నారు. ఏటీఎంల వద్ద కూడా శానిటైజర్‌, టిష్యూ పేపర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాంకు పనివేళలు కుదించడం వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఏటీఎంలలో తగినంత నగదు నిల్వలు ఉంటేలా చూడాలని కలెక్టర్‌ చెప్పారు. వైఎస్‌ఆర్‌ బీమా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నెలాఖరులోగా శతశాతం లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున బీమా లేని వ్యక్తులు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోతుందని, అందువల్ల ఎట్టి పరిస్థితిలోనూ నెలాఖరు నాటికి వైఎస్‌ఆర్‌ బీమా రెన్యూవల్‌తో పాటు కొత్తగా నమోదును కూడా పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి రోజు బ్యాంకు కార్యకలాపాలు ముగిసిన తరువాత 12 గంటల నుంచి 2 గంటల వరకూ వైఎస్‌ఆర్‌ బీమా నమోదుకు కేటాయించాలన్నారు. డీఆర్‌డీఏ సిబ్బంది ఈ వేళల్లోనే బ్యాంకులకు వెళ్లి బీమా రెన్యూవల్‌ నమోదు పూర్తయ్యేలా చూడాలని కోరారు. డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు మాట్లాడుతూ జూన్‌ మొదటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో వైఎస్‌ఆర్‌ బీమా నమోదు, రెన్యూవల్‌ ప్రక్రియలను గత నెల 16 నుంచి మొదలు పెట్టామని చెప్పారు. కొవిడ్‌ కారణంగా కాస్త జాప్యం జరుగుతోందని, నెలాఖరు నాటికి పూర్తి చేస్తామన్నారు. ఎల్‌డీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-19T04:56:36+05:30 IST