కొదమ రోడ్డు నిర్మాణం పరిశీలన

ABN , First Publish Date - 2021-08-26T05:20:18+05:30 IST

కొదమ రోడ్డు నిర్మాణాన్ని బుధవారం పోలీస్‌ ఓఎస్డీ ఎన్‌.సూర్యచంద్రరావు ఆకస్మికంగా పరిశీలిం చారు. ఆయన నంద మీదుగా పట్టుచెన్నారు వెళ్లారు.

కొదమ రోడ్డు నిర్మాణం పరిశీలన
గిరిజనులతో మాట్లాడుతున్న ఓఎస్డీ

సాలూరు రూరల్‌, ఆగస్టు 25:  కొదమ రోడ్డు నిర్మాణాన్ని  బుధవారం పోలీస్‌ ఓఎస్డీ ఎన్‌.సూర్యచంద్రరావు ఆకస్మికంగా  పరిశీలిం చారు. ఆయన నంద మీదుగా పట్టుచెన్నారు వెళ్లారు. అక్కడ గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పట్టుచెన్నారు మామిడిచెట్టు జంక్షన్‌ నుంచి కొదమ వెళ్లి ఇటీవల ఆరంభించిన రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అటుగా వెళ్లుతున్న గిరిజనులతో మాట్లాడారు. రేషన్‌ బియ్యానికి, ఇతర సామగ్రి తీసుకురావడానికి తాము పడుతున్న తిప్పలను వారు వివరించారు. అనంతరం పట్టుచెన్నారు, పగులుచెన్నారు, సొలిపిగుడ, కోనధార, డొలియాంబ, దిగువశెంబి, ఎగువశెంబి, నేరేళ్లవలస గిరిశిఖర గ్రామాల్లో ఆయన పర్యటించారు. 

 

Updated Date - 2021-08-26T05:20:18+05:30 IST