రేపటి నుంచి ఖాదర్‌వలీ బాబా ఉరుసు

ABN , First Publish Date - 2021-03-22T05:40:21+05:30 IST

సూఫీ మహాత్మా హజరత్‌ సయ్యద్‌ షహిన్‌షా బాబా ఖాదర్‌వలీ 62వ సుగంద చందోననోత్సావాలు ఈ నెల 23వ తేదీ నుంచి మూడు రోజులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

రేపటి నుంచి ఖాదర్‌వలీ బాబా ఉరుసు

విజయనగరం(ఆంధ్రజ్యోతి), మార్చి 21: సూఫీ మహాత్మా హజరత్‌ సయ్యద్‌ షహిన్‌షా బాబా ఖాదర్‌వలీ 62వ సుగంద చందోననోత్సావాలు ఈ నెల 23వ తేదీ నుంచి మూడు రోజులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. స్థానిక బాబామెట్ట ఖాదర్‌నగర్‌లోని ఖాదర్‌వలీ బాబా దర్గాలో  భక్తిప్రపత్తులతో ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఉరుసు నిర్వాహకుడు డాక్టర్‌ ఖలీలుల్లా షరీఫ్‌షా(ఖలీల్‌బాబు) తెలిపారు. ఆదివారం ఆయన దర్గా ప్రాంగాణంలో మాట్లాడుతూ ఉరుసు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూసేందుకు శానిటైజర్లు, మాస్కులు విధిగా వినియోగించేలా చూస్తామని చెప్పారు. మంగళవారం ఉరుసు మహోత్సవం ప్రారంభం సందర్భంగా పవిత్ర ఖురాన్‌ షరీఫ్‌షా పఠనం, జండా మహోత్సవం, బాబాకు చాదర సమర్చించటం జరుగుతుందన్నారు. బుధవారం ఉదయం 6 గంటలకు పవిత్ర ఖురాన్‌ పఠనం, 10 గంటలకు దర్బార్‌ షరీఫ్‌షా నుంచి నాషాన్‌ చాదర్‌, సందల్‌ షరీఫ్‌లతో ఫకీర్‌ మేళా ఖవ్వాలీ మేళాలతో ప్రత్యేక వాహనంలో పుర వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఆఖరి రోజున  ఖురాన్‌ షరీఫ్‌ పఠనం, చాదర్‌ సమర్పణ(దర్గా షరీఫ్‌) దస్తార్‌ బంది, భుక్తులకు చాదర్‌, తబరుక్‌ ప్రసాదల పంపిణీ ఉంటాయన్నారు.Updated Date - 2021-03-22T05:40:21+05:30 IST