కార్తీక పౌర్ణమి పూజలు

ABN , First Publish Date - 2021-11-19T05:58:38+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గురువారం కార్తీక పౌర్ణమి పూజలను భక్తులు ఘనంగా నిర్వహించారు. కేదారేశ్వర వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. నదులు, కాలువలు, చెరువుల్లో మహిళలు దీపాలు వదిలారు. శివాలయాల్లో జ్వలాతోరణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శైవక్షేత్రాలు విద్యుత్‌ దీపాలంకరణలో శోభాయమానంగా కనిపించాయి. పూజలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

కార్తీక పౌర్ణమి పూజలు
పశుపతినాదేశ్వరాలయంలో జ్వలా తోరణం




విజయనగరం (ఆంధ్ర జ్యోతి), నవంబరు 18 : జిల్లా వ్యాప్తంగా గురువారం కార్తీక పౌర్ణమి పూజలను భక్తులు ఘనంగా నిర్వహించారు. కేదారేశ్వర వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో  ఆచరించారు. మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. నదులు, కాలువలు, చెరువుల్లో మహిళలు దీపాలు వదిలారు. శివాలయాల్లో జ్వలాతోరణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శైవక్షేత్రాలు విద్యుత్‌ దీపాలంకరణలో శోభాయమానంగా కనిపించాయి. పూజలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. 





Updated Date - 2021-11-19T05:58:38+05:30 IST