టీడీపీ నుంచి ‘కలిశెట్టి’ బహిష్కరణ

ABN , First Publish Date - 2021-08-22T04:48:53+05:30 IST

టీడీపీ నుంచి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడును బహిష్కరించినట్లు ఆ పార్టీ విజయ నగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

టీడీపీ నుంచి ‘కలిశెట్టి’ బహిష్కరణ

విజయనగరం: టీడీపీ నుంచి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల  నియోజకవర్గ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడును బహిష్కరించినట్లు ఆ పార్టీ విజయ నగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కిమిడి నాగార్జున శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొంత కాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను పాల్ప డుతున్నారని పేర్కొన్నారు. అనేక పర్యాయాలు హెచ్చరించినా మార్పు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 17న సీనియర్‌ నాయకులు కళావెంకటరావు అధ్యక్షతన ఎచ్చెర్ల నియోజవర్గ సమ న్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ నిర్ణయాన్ని టీడీపీ అధ్యక్షుడు   చంద్రబాబుకు అప్పట్లోనే తెలియజేశామని పేర్కొన్నారు. ఆయన సూచనల మేరకు పార్టీ నుంచి కలిశెట్టిని బహిష్క రించినట్లు  చెప్పారు. పార్టీ శ్రేణులు ఈ విషయాన్ని గుర్తించాలని వెల్లడించారు. టీడీపీతో ఆయనకు ప్రమేయం లేదని స్పష్టం చేశారు.


 

Updated Date - 2021-08-22T04:48:53+05:30 IST