ఇంటింటికీ రేషన్‌ సరఫరా కష్టం

ABN , First Publish Date - 2021-02-06T04:50:28+05:30 IST

పిణీ చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది’..అంటూ రేషన్‌ సరఫరా చేసే వాహన యజమానులు (ఎండీయూ) జాయింట్‌ కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టానికి తగిన వేతనం గిట్టుబాటయ్యే పరిస్ధితి లేదని వాపోయారు. లే

ఇంటింటికీ రేషన్‌ సరఫరా కష్టం
సమీక్షలో మాట్లాడుతున్న జేసీ కిషోర్‌ కుమార్‌
తగిన ప్రతిఫలం లభించడం లేదు
ఎండీయూ, రేషన్‌ డీలర్ల సంఘ ప్రతినిధుల ఆవేదన
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : జేసీ కిషోర్‌కుమార్‌
కలెక్టరేట్‌, ఫిబ్రవరి 5:
‘ఇంటింటికీ వాహనాల ద్వారా రేషన్‌ సరుకుల సరఫరా కష్టతరంగా ఉంది. డిపోల్లో సరుకుల తూకం, లోడింగ్‌, ఇంటింటికీ వెళ్లి తూకం వేసి పంపిణీ చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది’..అంటూ రేషన్‌ సరఫరా చేసే వాహన యజమానులు (ఎండీయూ) జాయింట్‌ కలెక్టర్‌ కిషోర్‌కుమార్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.  తమ కష్టానికి తగిన వేతనం గిట్టుబాటయ్యే పరిస్ధితి లేదని వాపోయారు. లేబర్‌ చార్జీల రూపంలో ఇస్తామన్న రూ.3 వేలు ఏ మూలకూ సరిపోవని చెప్పారు. శుక్రవారం ఎండీయూ ప్రతినిధులు,  రేషన్‌ డీలర్లతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘ అధ్యక్షులు బుగత వెంకటేశ్వరరావు, సముద్రాల రామారావు మాట్లాడుతూ తమకు అంతంత మాత్రపు ఆదాయం వస్తోందని, చాలా మంది పరిస్ధితి దయనీయంగా ఉందని జేసీ దృష్టికి తీసుకొచ్చారు.  ఇలాంటి స్ధితిలో తాము కూలీలకు పెట్టుకునే స్థోమత లేదని చెప్పారు. కేవలం గౌరవం, గుర్తింపు కోసమే డిపోలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి కోట్లది రూపాయలు కమీషన్‌ బకాయి రావాల్సి ఉందన్నారు. జేసీ కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని..అందరూ సమన్వయంతో ముందుకు సాగి రేషన్‌ ఇంటింటికీ సరఫరాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డీఎస్‌వో పాపారావు, సివిల్‌ సప్లయ్స్‌ డీఎం వరకుమార్‌, విజయనగరం తహశీల్దార్‌ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-06T04:50:28+05:30 IST