కరోనా భయం పోయిందా?
ABN , First Publish Date - 2021-05-25T05:19:42+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉన్నా.. కొందరిలో ఆ భయం కనిపించడం లేదు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. సోమవారం మండల కేంద్రంలో నెలకొన్న పరిస్థితే ఇందుకు నిదర్శనం.

రామభద్రపురం, మే 24: కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉన్నా.. కొందరిలో ఆ భయం కనిపించడం లేదు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. సోమవారం మండల కేంద్రంలో నెలకొన్న పరిస్థితే ఇందుకు నిదర్శనం. చేయూత పథకానికి సంబంధించి ఫోన్ నెంబర్లు ఆధార్‌కు అనుసంధానం చేయాలని ఇటీవల ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో వివిధ గ్రామాల నుంచి వందలాది మంది మీ-సేవకు చేరుకున్నారు. భౌతిక దూరం పాటించకపోగా.. ఒకరిపై ఒకరు తోసుకున్నారు. వీరిని అదుపుచేయడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు, మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తుండగా.. అదేమీ పట్టించుకోకుండా ఇలా గుంపుగా చేరడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా అయితే కొవిడ్ కట్టడి ఎలా? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. దీనిపై ఉన్నతాఽ దికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.