సారాపై ఉక్కుపాదం : ఎస్పీ

ABN , First Publish Date - 2021-11-27T05:00:38+05:30 IST

సారా, గంజాయి అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ దీపికా పాటిల్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌ఈబీ అధికారులతో సమీక్షించారు.

సారాపై ఉక్కుపాదం : ఎస్పీ
మాట్లాడుతున్న ఎస్పీ

విజయనగరం క్రైం : సారా, గంజాయి అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ దీపికా పాటిల్‌  ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో  ఎస్‌ఈబీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... గ్రామస్థాయిలో  సారా తయారీ, రవాణా, అమ్మకాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  నిందితులపై ప్రత్యే నిఘా పెట్టి బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని సూచించారు.  మళ్లీ నేరాలకు పాల్పడకుండా వారినుంచి బాండ్‌లు తీసుకోవాలని తెలిపారు. అక్రమ రవాణాతో పట్టుబడిన వాహన యజమానులకు నోటీసులు జారీ చేసి ప్రతిపాద నలను సంబంధిత అధికారులకు పంపాలని చెప్పారు.  పెండింగ్‌ కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేయాలన్నారు. ఈ  సమావేశంలో ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీదేవిరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ రామచంద్రరావు, ఈఎస్‌ సుధాకర్‌రావు, ఎఈఎస్‌ శైలజారాణి  పాల్గొన్నారు.


 

Updated Date - 2021-11-27T05:00:38+05:30 IST