మధ్యాహ్న భోజనంపై విచారణ

ABN , First Publish Date - 2021-02-06T05:05:53+05:30 IST

మండలంలోని ధర్మవరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంద ని, దీనిపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారని పత్రికల్లో రావడంతో జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ మట్టా సింహాచలం స్పందించారు.

మధ్యాహ్న భోజనంపై విచారణ
భోజనం చేస్తున్న అసిస్టెంట్‌ కలెక్టర్‌

 చర్యలు తప్పవన్న అసిస్టెంట్‌ కలెక్టర్‌

శృంగవరపుకోట రూరల్‌: మండలంలోని ధర్మవరం పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంద ని, దీనిపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారని పత్రికల్లో రావడంతో జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ మట్టా సింహాచలం స్పందించారు. పత్రికల్లో వార్త చూసిన వెంటనే నేరుగా శుక్రవారం పాఠశా లకు వచ్చి హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, వంట నిర్వాహకులు, పాఠశాల పేరెంట్స్‌ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వ హించారు.  అనంతరం విద్యార్థులను ప్రశ్నించగా వారు భోజనం బాగోలేదని సమాధానం ఇచ్చారు. దీనిపై హెచ్‌ఎంతో మాట్లా డారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్‌ఐ నీలకంఠంను రప్పించి పాఠశాల పరిధిలో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని ప్రతిరోజూ పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించారు. మరోసారి విద్యార్థులకు ఇబ్బందికరమై న పరిణామాలు ఏర్పడితే సంబంధిత వ్యక్తులపై చర్యలకు సిపార్సు చేస్తామని హెచ్చరించారు. ఏండీఎం ఏడీ అరుణజ్యోతి, ఏంఎంవో బి.అప్పారావు, ఇన్‌చార్జి సీహెచ్‌డీటీ రామారావు తదితరులు ఉన్నారు.

 


Updated Date - 2021-02-06T05:05:53+05:30 IST