పెట్రో ధరల పెంపుపై వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-10-30T04:08:21+05:30 IST
పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం నగరంలో ఆటో డ్రైవర్లు వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రతినిధులు రమణ, జగన్మోహన్‌లు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
దాసన్నపేట, అక్టోబరు 29: పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం నగరంలో ఆటో డ్రైవర్లు వినూత్నరీతిలో ఆందోళన చేపట్టారు. ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ ప్రతినిధులు రమణ, జగన్మోహన్‌లు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. పెట్రో ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తరువాత మాటే మరిచిపోయాయని ఆరోపించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం తగదన్నారు. తక్షణం ధరలు తగ్గించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో కనకదుర్గా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు పాపారావు, రామనాయుడు, శ్రీను, భాస్కరరావు, బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.